బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నేటితో(మార్చి 6) 24వ వసంతంలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా తన తల్లి, దివంగత నటి శ్రీదేవిని గుర్తు చేసుకుని భావోద్యేగానికి లోనయ్యారు. ఓ ఇంటర్యూలో తన పుట్టిన రోజునా శ్రీదేశి చాలా హడావుడి చేసేవారని చెప్పారు. ‘నా ప్రతి పుట్టిన రోజును మా అమ్మ ఏప్పుడూ ప్రత్యేకంగా ఉంచేవారు. ముందు రోజు రాత్రి నా రూం అంతా బెలూన్‌లతో ప్రత్యేకంగా అలంకరించి కేక్ కట్ చేయించేవారు. ఆరోజు అమ్మ.. నన్ను చాలా గారాబం చేసేది. అయితే డాడీ(బోణి కపూర్) ఇప్పటికీ ప్రతి రోజు నన్ను గారాబం చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చారు.
వైరల్: పర్‌ఫెక్ట్ స్టెప్పులతో అదరగొట్టిన జాన్వీ
అంతేగాక మన ప్రత్యేకమైన రోజునా(పుట్టిన రోజు) ఖరీదైన బహుమతుల కంటే మనకు ఇష్టమైన వాళ్లతో గడపే సమయం చాలా విలువైనదని జాన్వీ చెప్పారు. ఇక తన తల్లి పోలికలతో జాన్వీని పోల్చడంపై స్పందించారు. ‘నేను మా అమ్మకు చాలా భిన్నంగా ఉంటానన్న విషయాని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే. ‘ధడక్’ తర్వాత కొంత మందికి అది అర్ఢమైంది కానీ ఇప్ప టికీ కొందరూ నాలో శ్రీదేవిని చూస్తున్నారు’ అని అన్నారు.
దక్షిణాదిలో జాన్వి ఎంట్రీ షురూ?
జాన్వీ బర్త్ డే: అమ్మ ఉంటే ఇలా చేసేది!
Published Fri, Mar 6 2020 11:04 AM | Last Updated on Tue, Mar 10 2020 9:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment