గాయని జెస్సికా తండ్రికి క్యాన్సర్.. | Jessica Simpson's father diagnosed with cancer | Sakshi
Sakshi News home page

గాయని జెస్సికా తండ్రికి క్యాన్సర్..

Published Tue, Nov 15 2016 2:20 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

గాయని జెస్సికా తండ్రికి క్యాన్సర్..

గాయని జెస్సికా తండ్రికి క్యాన్సర్..

లాస్ ఎంజెల్స్: హాలీవుడ్ ప్రముఖ గాయని జెస్సికా సింప్సన్ తండ్రి, ప్రముఖ ఫొటోగ్రాఫర్ జో సింప్సన్(58) క్యాన్సర్ బారిన పడ్డారు. ఆయన గత రెండు నెలల కిందట ప్రొస్టేట్ క్యాన్సర్కు గురయ్యారని పీపుల్ మేగజిన్ తెలిపింది. ప్రస్తుతం ఆయన సర్జరీ చేయించుకున్నారని, తిరిగి కోలుకుంటారని, నిండైన ఆశాభావంతో కనిపించారని మేగజిన్ పేర్కొంది.

చికిత్స తీసుకుంటున్న సమయంలో కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి ఆయనకు గొప్ప సహకారం అందిందని, ముఖ్యంగా తన కూతుర్లు ఆష్లీ, జెస్సికా తనను కాపాడుకున్న తీరు మాటల్లో చెప్పలేనని ఆయన అన్నారట. ఇలాంటి సమస్యలతో ఉన్న జో మరోసారి తన ఫొటో గ్రాఫర్ కెరీర్ ను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చని వైద్యులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement