
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇప్పటీ వరకు జరిగిన షెడ్యూల్‌లో ఎక్కువగా యాక్షన్, ఫ్యామిలీ డ్రామాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది.
తదుపరి షెడ్యూల్‌లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్‌ను చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్‌లో కొన్ని కాలేజ్ సీన్స్ కూడా చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కాలేజ్ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా మరోసారి కాలేజ్ స్టూడెంట్‌గా మారిపోతున్నాడు. 2016లో రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ లోనూ ఎన్టీఆర్ స్టూడెంట్ గా కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment