బాసూ... ఇతనే బిగ్‌ బాస్‌! | Junior NTR to host Telugu version of Bigg Boss | Sakshi
Sakshi News home page

బాసూ... ఇతనే బిగ్‌ బాస్‌!

Published Tue, Jun 13 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

బాసూ... ఇతనే బిగ్‌ బాస్‌!

బాసూ... ఇతనే బిగ్‌ బాస్‌!

కన్ను కొట్టి మరీ బుల్లితెరపై ఓ కన్నేశానని ఎన్టీఆర్‌ కన్ఫర్మ్‌ చేశారు. ‘స్టార్‌ మా’లో ప్రసారం కానున్న ‘బిగ్‌ బాస్‌’ షోకి ఎన్టీఆర్‌ హోస్ట్‌ (వ్యాఖ్యాత)గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. అందులో ఈ లుక్‌తోనే కనిపించనున్నారు. దీనిపై ఎన్టీఆర్‌ మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులకు బుల్లితెర (టీవీ) అనేది ఓ భారీ వినోద మాధ్యమం. ‘బిగ్‌ బాస్‌’ గురించి ‘స్టార్‌ మా’ వాళ్లు సంప్రదించినప్పుడు ఆసక్తిగా, సవాల్‌గా అన్పించింది. ఈ షో తప్పకుండా గేమ్‌ చేంజర్‌ అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు.

ఈ షో కాన్సెప్ట్‌ ఏంటంటే... ఓ స్పెషల్‌ హౌస్‌లో సుమారు పన్నెండు మంది సెలబ్రిటీలను పెట్టి తాళం వేస్తారు. బయట ప్రపంచంతో వాళ్లకు సంబంధం ఉండదు. నో టీవీ, నో ఫోన్, నో పేపర్‌! అప్పుడు.. ఆ ఇంట్లో... వాళ్లు ఎలా ఉన్నారనేది రికార్డు చేసి టీవీలో టెలికాస్ట్‌ చేస్తారు. సౌతిండియాలో ఓ యంగ్‌ హీరో ఇలాంటి టీవీ షో చేయనుండడం ఇదే తొలిసారి. హిందీలో సల్మాన్‌ఖాన్‌ హోస్ట్‌ చేసిన ఈ ‘బిగ్‌ బాస్‌’ షోను తమిళంలో కమల్‌ హాసన్, కన్నడలో ‘ఈగ’ ఫేమ్‌ సుదీప్‌ చేస్తున్నారు. ‘స్టార్‌ మా’ బిజినెస్‌ హెడ్‌ అలోక్‌ జైన్‌ మాట్లాడుతూ – ‘‘తెలుగు ప్రజల మనోభావాలను, విలువలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండేలా ఈ షోను ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement