‘‘మీకు ‘సస్పెండెడ్ కాఫీ, సస్పెండెడ్ మీల్స్’ అంటే ఏంటో తెలుసా? తెలియనివాళ్ల కోసం నేను వివరంగా చెబుతాను’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. ఈ బ్యూటీ చెప్పిన విషయం చదివితే ఎవరికైనా ‘భలే మంచి విషయం చెప్పింది’ అనిపించడం ఖాయం. ఈ విషయం గురించి కాజల్ మాట్లాడుతూ – ‘‘నార్వేలో ఒక మహిళ రెస్టారెంట్‌కి వచ్చి ఐదు కాఫీలకు డబ్బులు ఇచ్చి, మూడు తీసుకుని, ‘రెండు సస్పెండెడ్’ అంది.
ఒక అతను పది కాఫీలకు డబ్బులు కట్టి, ఐదు తీసుకెళుతూ ‘ఐదు సస్పెండెడ్’ అన్నాడు. ఇంకో వ్యక్తి ఐదు మీల్స్‌కి బిల్ కట్టి, ‘రెండు సస్పెండెడ్’ అని మూడు మాత్రమే తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఒక పెద్దాయన వచ్చాడు. ఆయన బట్టలు కూడా బాగాలేవు. ‘సస్పెండెడ్ కాఫీ ఏమైనా ఉందా?’ అనడిగాడు. కౌంటర్‌లో ఉన్న మహిళ ‘యస్..’ అని వేడి వేడి కాఫీ కప్ ఆయన చేతికి ఇచ్చింది. మరికాసేపటికి ఇంకో వ్యక్తి వచ్చి, ‘సస్పెండెడ్ మీల్ ఉందా?’ అనడిగాడు. కౌంటర్‌లో ఉన్న అబ్బాయి వేడి వేడి అన్నం, కూర, వాటర్ బాటిల్ ఇచ్చాడు.
సస్పెండెడ్ అంటే ఏంటో ఇప్పుడు అర్థం అయ్యిందనుకుంటున్నా. మనం డబ్బులు కట్టి కూడా తీసుకోకుండా వదిలేసినవాటిని ఆ రెస్టారెంట్‌లో అలా అంటున్నారు. వాటిని పేదవారికి ఇస్తున్నారు. ముక్కూముఖం తెలియనివాళ్లకు చేస్తున్న ఈ సహాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. యూరోప్‌లోని పలు దేశాల్లో ఉన్న రెస్టారెంట్స్‌లో ఈ పద్ధతిని ఆచరిస్తున్నారు. మెల్లిగా ప్రపంచం మొత్తానికి ఈ విధానం విస్తరిస్తోంది. మనం కూడా ఈ స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను’’ అన్నారు. నిజంగానే భలే మంచి విషయం చెప్పింది కదూ.
Comments
Please login to add a commentAdd a comment