పారితోషికం తగ్గించుకున్న కాజల్‌..! | Kajal Aggarwal Downs Her Remuneration | Sakshi
Sakshi News home page

పారితోషికం తగ్గించుకున్న కాజల్‌..!

Sep 10 2019 8:02 AM | Updated on Sep 10 2019 8:02 AM

Kajal Aggarwal Downs Her Remuneration - Sakshi

కాజల్‌ కేవలం రూ.30 లక్షలు మాత్రమే తీసుకుని నటించడానికి రెడీ అనేసిందట.

సినిమా: దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న నటీమణుల్లో కాజల్‌అగర్వాల్‌ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజం చెప్పాలంటే ఈ బ్యూటీకి ఇటీవల ఏ భాషలోనూ హిట్‌ లేదు. అలాంటిది ఇటీవల తమిళంలో జయంరవితో నటించిన కోమాలి చిత్రం సక్సెస్‌ అయ్యి కాజల్‌కు నూతనోత్సాహాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే జయాపజయాలకు అతీతంగా ఈ ఉత్తరాది భామకు అవకాశాలు వరించడం విశేషం. కోమాలి చిత్రానికి ముందే స్టార్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌తో ఇండియన్‌ 2లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక తెలుగులోనూ కొత్త చిత్రాలు చర్చలో ఉన్నాయని సమాచారం. ఇలాంటి ఒక బాలీవుడ్‌ అవకాశం కాజల్‌అగర్వాల్‌ను వరించింది.

ఈ బ్యూటీ ఇప్పటికే హిందిలో కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే అక్కడ పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయింది. ఇది కాజల్‌కు ఆశానిపాతంగానే మిగిలింది. ఎలాగైన బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అనిపించుకోవాలని ఆశపడుతున్న తరుణంలో వచ్చిన అవకాశాన్ని ఈ జాణ వదులుకోదలచుకోలేదట. అందుకు ఈ అమ్మడు ఏం చేసిందో తెలుసా? సాధారణంగా కాజల్‌అగర్వాల్‌ ఒక తెలుగు చిత్రంలో నటించడానికి ఇతరత్రా ఖర్చులు కాకుండా రూ. 1.75 కోట్లు పారితోషికం పుచ్చుకుంటుందని సమాచారం. ఇక అన్ని కలిసి రూ. 2 కోట్లకు చేరుతుందట. అలాంటిది హిందీ చిత్రానికి తన పారితోషికాన్ని భారీగా తగ్గించుకుందన్న విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. హిందీ చిత్రానికి కాజల్‌ కేవలం రూ.30 లక్షలు మాత్రమే తీసుకుని నటించడానికి రెడీ అనేసిందట. ఇందులో కాజల్‌అగర్వాల్‌ నటుడు జాన్‌ అబ్రహంకు జంటగా నటిస్తోంది. ఎంత హిందీ చిత్రంలో నటించాలన్న కోరిక ఉన్నా తన పారితోషికాన్ని అంత భారీగా తగ్గించుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే  పారితోషికం తగ్గించుకున్నా ఫలితం దక్కితే సరి. అయితే దక్షిణాది నిర్మాతలు పారితోషికం తగ్గిస్తామంటే కాజల్‌కు పెద్ద షాక్‌ అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement