స్క్రీన్ పంచుకుంటున్న తండ్రీ కూతుళ్లు
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, ఆయన వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ ఒకే సినిమాలో కలిసి నటించనున్నారు. చాలా రోజులుగా ఈ వార్త కోలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నా, ఇంత వరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఫైనల్గా ఈ నెల 29నుంచి కమల్, శ్రుతీలు కలిసి నటిస్తున్న సినిమా సెట్స్ మీదకు వెళుతున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.
ఈ సినిమాలో కమల్ హాసన్, శ్రుతి హాసన్లు తండ్రీ కూతుళ్లుగానే నటించనున్నారు. టికె రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరగనున్న ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తరువాత తొలిసారిగా ఈ సినిమాతోనే తన తండ్రితో కలిసి నటించటం విశేషం.