ప్రభాస్ సరసన అందుకే నటించిందట!
ముంబై: ' ఏక్ నిరంజన్' సినిమాలో ప్రభాస్ సరసన నటించేందుకు కంగనా రనౌత్ ఎందుకు ఒప్పుకొందో తెలుసా? కంగనాతో విడిపోయిన బాలీవుడ్ హీరో, మరో మాజీప్రియుడు అధ్యాయన్ సుమన్ మరో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే కంగనా, హృతిక్ రోషన్‌ల మధ్య వివాదానికి ఆజ్యం పోసిన సుమన్ తాజాగా టాలీవుడ్‌కి షాకిచ్చాడు. కంగనాకు చేతబడి లాంటి క్షుద్రవిద్యలు తెలుసుని ఆరోపించిన అతడు, మరో సంచలన విషయాన్ని వెల్లడించాడు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ఏక్ నిరంజన్ చిత్రంలో కంగనా రనౌత్ చేయటానికి కారణం ఓ బీఎండబ్ల్యు కారు అని వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని అధ్యయన్ సుమన్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ వివరించాడు. "అప్పట్లో మా నాన్నగారు నాకు ఓ బీఎండబ్ల్యు కారు గిప్ట్ గా ఇచ్చారు. ఇది చూసిన కంగనా చాలా అసూయ ఫీలయ్యింది. వెంటనే ఆమె హైదరాబాద్ వెళ్లి అక్కడ ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రానికి కమిటైంది. కేవలం ఆ కారు కొనుక్కునే డబ్బు కోసమే ప్రభాస్ సరసన నటించేందుకు ఒప్పుకుంది'' అని తెలిపాడు. ఆ డబ్బుతో వెంటనే బీఎండబ్ల్యు కొనుక్కుని నాకు చూపించిందని, అంతటి అసూయ, హై టెంపర్ ఉన్న అమ్మాయి కంగనా అని తేల్చి చెప్పాడు.
మరోవైపు ఒక మహిళను కించపరచడానికి ఇదంతా చేశానని భావిస్తే తానేమీ చేయలేనని, పబ్లిసిటీ కోసం చేయడంలేదని ట్విట్టర్ లో వివరణ ఇచ్చాడు. తనకు మద్దతు తెలిపినవారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్ చేశాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా...
తన గుండెలోని వచ్చిన మాటలన్నాడు. ఇలా ఇంకెవరికీ కాకూదని ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
కాగా 2008లో 'రాజ్: ద మిస్టరీ కంటిన్యూస్' సినిమా సందర్భంగా సుమన్, కంగన మధ్య వ్యవహారం నడిచింది. విడిపోయిన దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత కంగనాను ప్రేమించి మోసపోయానని, ఆమెకు చేతబడిలాంటి క్షుద్రవిద్యలు తెలుసంటూ వ్యాఖ్యానించి అధ్యయన్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.