డార్లింగ్ ప్రభాస్ తన తోటి నటులతో ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు ఉదాహరణలు కూడా బోలెడు ఉన్నాయి. అంతెందుకు ఈ బాహుబలి స్టార్‌తో సినిమా చేసిన తర్వాత అతనికి స్నేహితులు అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటిది ఓ స్టార్ హీరోయిన్ ప్రభాస్‌తో సినిమా చేస్తున్నప్పడు గొడవ పడింది. ఎంతలా అంటే వారిద్దరి మధ్య మాటలు ఆగిపోయేంతలా! ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా? ఆమె బాలీవుడ్ భామ కంగనా రనౌత్.
కంగనా నటించిన జయలలిత బయోపిక్ తలైవి సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వినాయక చవితి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాను నటించిన ఏకైక తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రభాస్‌తో కలిసి దాదాపు 12 ఏళ్ల క్రితం సినిమాలో నటిస్తున్న సమయంలో తరచూ తనతో గొడవ పడేదని చెప్పింది ఈ అమ్మడు. అలా మొదలైన గొడవ వల్ల కొన్ని రోజులు తర్వాత వారి మధ్య మాటలు ఆగిపోయినట్లు చెప్పుకొచ్చింది.
ఇటీవల బాహుబలి సినిమాలో ప్రభాస్‌ను నటన చూసిన చాలా గర్వంగా అనిపించిందని తెలిపింది. వీలైతే తనకు మరోసారి ప్రభాస్‌తో నటించే అవకాశం ఇవ్వాలని పూరీ జగన్నాథ్‌ను మీడియా ముఖంగా కోరింది ఈ అమ్మడు. కంగనా వారి మధ్య జరిగిన గొడవ చెప్పింది కానీ.. ఏ విషయంపై గొడవ జరిగిందనేది మాత్రం చెప్పలేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్, కంగనా రనౌత్ కలిసి నటించిన సంగతి తెలిసిందే.
చదవండి: Prabhas Radheshyam: రాధేశ్యామ్‌లో విలన్‌గా బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి?
Comments
Please login to add a commentAdd a comment