డేర్ అండ్ డాషింగ్ యాక్టర్స్ కొద్దిమందే ఉంటారు. వాళ్లు ఏదైనా ముక్కుసూటిగా చెప్పేస్తుంటారు. అలాంటి లిస్టులో "పంగా" హీరోయిన్ కంగనా రనౌత్ ముందు వరుసలో ఉంటుంది. ఓవైపు దేశవ్యాప్తంగా ఉన్న లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకొమ్మని సూచిస్తూనే మరోవైపు తన జీవితంలోని చెడు రోజులను గుర్తు చేసుకుంది. గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను వడబోస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. అందులో ఆమె మాట్లాడుతూ.. స్వీయ నిర్బంధంలో ఈ రోజును నవరాత్రులుగా (తొమ్మిదో రోజు అవుతున్నందున) అభివర్ణించింది. ఇన్నిరోజులు ఇంట్లో ఉండటాన్ని బోర్‌గా ఫీల్ అవకండని సూచించింది. నిజానికి చెడ్డ రోజులే మనకు మంచి రోజులుగా మారుతాయని పేర్కొంది. "అప్పుడు నాకు 15 ఏళ్లు ఉంటాయనుకుంటా.. ఇంటి నుంచి పారిపోయాను. ఆ క్షణం నేను నక్షత్రాలను అందుకుని నా గుప్పి ట్లో పెట్టుకున్నట్లు ఉద్వేగానికి లోనయ్యాను. నేను ఇల్లు విడిచి పెట్టిన రెండు సంవత్సరాలకే సినిమా స్టార్‌నయ్యాను. కానీ డ్రగ్స్‌కు బానిసగా మారిపోయాను. (కంగనా ముందు పెద్ద సవాల్)
అప్పుడు నా జీవితం గందరళంగా మారిపోయింది. కానీ చావు నుంచి సైతం నన్ను రక్షించగలిగే కొద్ది మంది వ్యక్తులు నా వెంట ఉన్నారు. ఇదంతా నా యుక్త వయసులో జరిగింది. సరిగ్గా ఇదే సమయంలో ఒక ఫ్రెండ్ నా జీవితంలోకి ప్రవేశించింది. యోగాను పరిచయం చేసింది. రాజయోగ పుస్తకాన్ని అందించింది. అలా ఆధ్యాత్మికత వైపు నడిపించింది. ఆ తర్వాత నేను స్వామి వివేకానందను నా గురువుగా ఎంచుకున్నాను. అప్పటి నుంచి వ్యక్తిగతంగా ఎంతో ఎదిగాను. కానీ ఇలాంటి చాలెంజ్‌లు ఎదురవకపోతే నా గుర్తింపును కోల్పోయేదాన్ని. ఆధ్యాత్మిక మార్గం లేకుండా నా తెలివి తేటలను, మానసిక ఆరోగ్యాన్ని, స్వశక్తిని పెంపొందించుకోలేకపోయేదాన్ని" అని తెలిపింది. పనిలో పనిగా బ్రహ్మచర్యం గురించి కూడా కొన్ని మాటలను చెప్పుకొచ్చింది. బ్రహ్మచర్యం అంటే పెళ్లికి దూరంగా ఉండటం కానేకాదని.. మరెన్నో ప్రయోజనాలున్నాయని తెలిపింది. చివరిగా అందరూ తమకు దొరికిన సమయాన్ని ఉపయోగించుకోండంటూ కంగనా పిలుపునిచ్చింది
Comments
Please login to add a commentAdd a comment