బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’ | Karan Johar Remakes Dear Comrade Movie In Bollywood | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌కు వెళ్లనున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

Published Tue, Jul 23 2019 7:26 PM | Last Updated on Tue, Jul 23 2019 7:27 PM

Karan Johar Remakes Dear Comrade Movie In Bollywood - Sakshi

టాలీవుడ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందాన్న నటించిన డియర్‌ కామ్రేడ్‌ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో పాగావేసిన విజయ్‌.. ఈ చిత్రంలో మొత్తం దక్షిణాదిలో హస్తగతం చేసుకునేందుకు రెడీ అయ్యాడు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

అయితే తాజాగా ఈ మూవీని బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహర్‌ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించినట్లు తెలుస్తోంది. సినిమాను చూసిన అనంతరం డియర్‌ కామ్రేడ్‌ హక్కులను తీసుకుని, రీమేక్‌ చేసేందుకు సిద్దమైనట్లు ప్రకటించారు. ఈ మూవీలో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందాన్నలు అద్భుతంగా నటించారని, దర్శకుడిగా తొలిచిత్రమైనా.. భరత్‌ కమ్మ అత్యద్భుతంగా చిత్రీకరించారని, జస్టిన్‌ ప్రభాకరన్ సంగీతం బాగుందని పేర్కొన్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌పై రీమేక్‌ కానున్న ఈ చిత్రంలో ఎవరు నటించనున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement