కార్తీ.. కెరీర్ లోనే తొలిసారిగా..! | Karthi does it for the first time for Manis film | Sakshi
Sakshi News home page

కార్తీ.. కెరీర్ లోనే తొలిసారిగా..!

Published Wed, Aug 10 2016 12:47 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

కార్తీ.. కెరీర్ లోనే తొలిసారిగా..!

కార్తీ.. కెరీర్ లోనే తొలిసారిగా..!

సూర్య వారుసుడిగా కోలీవుడ్లో అడుగుపెట్టిన కార్తీ తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో పైలట్గా నటిస్తున్న కార్తీ మూడు డిఫరెంట్ లుక్స్లో అలరించనున్నాడు.

కార్తీ లుక్స్కు సంబందించిన ఆసక్తికరమైన వార్త ఒకటి కోలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి కార్తీ రఫ్ లుక్లో గడ్డం, మీసంతో కనిపిస్తున్నాడు. పోలీస్ క్యారెక్టర్లలో కనిపించిన ఒకటి రెండు సినిమాల్లో షేవింగ్ చేసినా మీసం లేకుండా మాత్రం ఇంత వరకు కనిపించలేదు. అయితే తొలిసారిగా మణిరత్నం సినిమా కోసం మీసం తీసేసి నటిస్తున్నాడు కార్తీ. కార్తీ లుక్కు సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

కాట్రు వెలియిదై పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ సరసన అదితి రావ్ హైదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల పాండిచ్చేరిలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రస్తుతం చెన్నైలోని బిన్నీమిల్స్లో హోలి నేపథ్యంలో వచ్చే పాట చిత్రీకరణలో బిజీగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement