అన్నదమ్ములిద్దరూ ఒకే సినిమాలో..? | Karthi In Suriya's Singam S3 | Sakshi
Sakshi News home page

అన్నదమ్ములిద్దరూ ఒకే సినిమాలో..?

Published Thu, May 19 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

అన్నదమ్ములిద్దరూ ఒకే సినిమాలో..?

అన్నదమ్ములిద్దరూ ఒకే సినిమాలో..?

సూర్య, కార్తీలు ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నారు. ‘ఊపిరి’తో తెలుగు, తమిళ భాషల్లో కార్తీ హిట్ కొడితే, సైన్స్ ఫిక్షన్  మూవీ ‘24’తో సూర్య తెలుగు, తమిళ భాషల్లో ఓ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా సూర్య హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సింగం-3’. ఇందులో కార్తీ ఓ ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా సూర్యతో కలిసి ఓ పాటకు చిందేయడానికి సిద్ధమవుతున్నారట. చెన్నై కోడంబాక్కంలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. నిజంగానే ఈ అన్నదమ్ములిద్దరూ నటిస్తే,  ఇటు సూర్య, అటు కార్తీ అభిమానులకు ‘సింగం-3’ స్పెషల్ అవుతుందన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement