ఓ బిడ్డ తల్లిగా... | Katrina Kaif to play a single mother? | Sakshi
Sakshi News home page

ఓ బిడ్డ తల్లిగా...

Published Wed, Jul 30 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

ఓ బిడ్డ తల్లిగా...

ఓ బిడ్డ తల్లిగా...

హిందీ చిత్రసీమలో నంబర్‌వన్ అందాలతార ఎవరంటే దాదాపుగా అందరూ కత్రినాకైఫ్ పేరే చెబుతారు. అందుకు తగ్గట్టుగానే ఆమె అత్యధిక శాతం గ్లామర్ పాత్రలే పోషిస్తుంటారు.

హిందీ చిత్రసీమలో నంబర్‌వన్ అందాలతార ఎవరంటే దాదాపుగా అందరూ కత్రినాకైఫ్ పేరే చెబుతారు. అందుకు తగ్గట్టుగానే ఆమె అత్యధిక శాతం గ్లామర్ పాత్రలే పోషిస్తుంటారు. ‘రాజ్‌నీతి’ సినిమా తరహాలో అప్పుడప్పుడూ ప్రయోగాత్మక పాత్రలు చేస్తుంటారు. ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. ‘కహానీ’ చిత్రం ద్వారా విద్యాబాలన్‌కి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన సుజయ్ ఘోష్ ఈ చిత్రానికి దర్శకుడు.
 
 ఇందులో కత్రినా పాత్ర విభిన్నంగా ఉంటుందని వినికిడి. భర్తలేని ఒంటరి ఆడదానిగా కత్రినా కనిపించనుందట. పైగా ఇందులో ఆమె ఓ బిడ్డకు తల్లి కూడానట. జపాన్ నవల ’ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ అనే చిత్రం ఆధారంగా సుజయ్‌ఘోష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో కత్రినాకైఫ్ నటించిన భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ విభిన్న పాత్రలో కనిపిస్తే, అభిమానులు సంతృప్తి చెందుతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement