
తండ్రి లేని లోటు నాకు బాగా తెలుసు.. నా పిల్లలకు ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. తన చిన్నప్పుడే కత్రినా తల్లిదండ్రులు మనస్పర్ధలతో విడిపోయారు. దాంతో చిన్నప్పటి నుంచి కత్రినా తండ్రి లేకుండానే పెరిగారు. ఈ విషయం గురించి కత్రినా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆడపిల్ల జీవితంలో తండ్రి లేకపోతే.. ఒక శూన్యం ఏర్పడుతుంది. అభద్రతకు గురవుతుంది. ఈ బాధలను నేను అనుభవించాను. ఎందుకంటే నేను తండ్రి లేకుండా పెరిగాను. ఆ లోటు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే భవిష్యత్తులో నా పిల్లలకు ఆ లోటు ఉండకూడదు. వారికి తల్లిదండ్రులతో కలిసి ఉంటే కలిగే అనుభూతి తెలియాలి’ అన్నారు.
అయితే ‘జీవితంలో తండ్రి లేనంత మాత్రాన ఓ ఆడపిల్ల అన్నీ కోల్పోయినట్లు కాదు. మేం ఏడుగురు తోబుట్టువులం. మా అమ్మ మమ్మల్ని చాలా క్రమశిక్షణతో పెంచింది. చిన్నప్పుడు నేను చాలా సైలెంట్‌గా ఉండేదాన్ని. అన్నీ నాలోనే దాచుకునేదాన్ని. అలాంటిది నేను హీరోయిన్ ఎలా అయ్యానో నాకే తెలీడంలేదు’ అన్నారు. ప్రసుత్తం కత్రినా కైఫ్, సల్మాన్‌తో నటించిన ‘భారత్’ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిశా పటానీ మరో కథానాయికగా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment