
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్
ప్రకృతి అడ్డొచ్చిందని బెదరలేదు. అంతర్గత విభేదాలు వచ్చాయని ఆగలేదు. నమ్మకంతో పట్టుదలగా ముందుకు వెళ్లి సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఇదంతా.. హిందీలో రూపొందుతోన్న ‘కేదార్‌నాథ్’ మూవీ గురించే. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, సారా అలీఖాన్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘కేదార్‌నాథ్’. వెదర్ సహకరించకపోవడం వల్ల షూటింగ్ కాస్త ఆలస్యం అయింది. ఈలోపు చిత్రబృందంలో అంతర్గత కలహాలు వచ్చాయన్న కారణాలతో సినిమా ఆగిపోయిందన్నారు బీటౌన్ సినిమా జనాలు. కానీ సడన్‌గా కొత్త రిలీజ్ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించడంతో సినిమాపై ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి. తాజాగా ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ను కంప్లీట్ చేశారు సుశాంత్. దీంతో.. హమ్మయ్య..నా పని కంప్లీటైందని ఊపిరి పీల్చుకున్నారట సుశాంత్. ‘కేదార్‌నాథ్’ సినిమా ఈ ఏడాది నవంబర్ 30న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment