అలాంటివి నాకు చెప్పొద్దు! | Keerthi suresh doing Bhairawa movie | Sakshi
Sakshi News home page

అలాంటివి నాకు చెప్పొద్దు!

Published Thu, Nov 17 2016 4:07 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM

అలాంటివి నాకు చెప్పొద్దు!

అలాంటివి నాకు చెప్పొద్దు!

తల్లి చాటు పిల్ల అనుకున్న కీర్తీసురేశ్ చాలా ఎదిగిపోయారనిపిస్తోంది తన మాటలను చూస్తుంటే. రజనీమురుగన్, రెమో చిత్రాల విజయాలు ఈ మాలీవుడ్ బ్యూటీని క్రేజీ స్టార్‌నే చేశాయని చెప్పొచ్చు. ప్రస్తుతం విజయ్‌కు జంటగా భైరవా చిత్రంలో నటిస్తున్న కీర్తీసురేశ్, త్వరలో మరోస్టార్ హీరో సూర్య సరసన తానా చేర్న్‌ద్దకూటం చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇక తెలుగులో నానీకి జంటగా నేను పక్కా లోకల్ చిత్రంలో నటిస్తున్నారు. బాబీసింహాతో జత కట్టిన పాంబుసటై్ట చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇలా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తీసురేశ్ తన భావాలను తెలుపుతూ వేగంగా ఎదుగుతున్న తాను అంతే వేగంగా పడిపోకూడదన్న విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానంటున్నారు.

అందుకే కథల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. నటనలోనూ గత పాత్రలకు భిన్నంగా అభినయాన్ని చూసించాలన్న విషయంలోనూ తగిన శ్రద్ధ చూపిస్తున్నానని చెప్పారు.ముఖ్యంగా తన వద్దకు కథలు చెప్పడానికి వచ్చే దర్శక నిర్మాతలు ఇది ఆ తరహా పాత్ర అని, ఇంతకు ముందు పలానా నటి ఇలాంటి పాత్రలో నటించారని చెబుతుంటారన్నారు. అలాంటి వాటి గురించి తన వద్ద చెప్పవద్దని తాను వారికి చాలా స్ట్ట్రిక్ట్‌గా చెబుతానన్నారు.ఎందుకంటే తానా పాత్రలో నటించేటప్పుడు అంతకు ముందు దర్శకుడు చెప్పిన ఆ నటి నటనే తన మదిలో మెదులుతుందన్నారు. అది తనకు ఇష్టం లేదన్నారు. నటనలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుని నటిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నదే తన పాలసీ అని కీర్తీసురేశ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement