మహానటి లుక్ అదుర్స్..!
అలనాటి అందాల తార సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను అశ్వినిదత్ కూతురు స్వప్నా దత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో కీర్తి లుక్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
80ల నాటి హెయిర్ స్టైల్, జ్యువెలరీతో కీర్తి సురేష్ లుక్ ఆకట్టుకుంటోంది. సమంత మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్.. జెమినీ గణేషన్ పాత్రలో నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, షాలిని పాండే, ప్రగ్యా జైస్వాల్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి మహానటి సినిమాను తెరకెక్కిస్తున్నారు.