
అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథపై ‘మహానటి’ పేరుతో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను అశ్వినీ దత్ కుమార్తె స్వప్నదత్ నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే సావిత్రి పాత్రకు కీర్తి తొలి ఎంపిక కాదన్న టాక్ వినిపిస్తోంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముందుగా సావిత్రి పాత్రకు సమంతను తీసుకోవాలని భావించారట. అయితే దర్శకుడు ఎక్కువ సినిమాలు చేయని హీరోయిన్ అయితే సావిత్రి పాత్రకు కరెక్ట్ అని భావించటంతో కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారు. మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ జెమినీ గణేషన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సమంత మరో కీలక పాత్రలో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment