
ప్రేమలో పడ్డాను కానీ..! నటి
నేనూ ప్రేమలో పడ్డాను కానీ.. అంటోంది కేరళా కుట్టి డెల్నా డేవీస్. అందమైన అమ్మాయిలకు ముఖ్యంగా హీరోయిన్లకు కేరాఫ్ అంటే కేరళానే అన్నంతగా వాసికెక్కింది. తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటకలతో పాటు ముంబాయి నుంచి హీరోయిన్లు పరిచయం అవుతున్నా.. కేరళా బ్యూటీస్ అంటేనే చాలా స్పెషల్. అసిన్, నయనతార, ఇలా చాలా మంది మలయళీ దక్షిణాదిలో హీరోయిన్లుగా హవా కొనసాగించారు. తాజాగా ఆ గూటి నుంచి వచ్చిన నటి డెల్నా డేవీస్.
మాతృభాషలో హ్యాఫీ వెడింగ్ చిత్రంతో హిట్ ఖాతాను తెరిచి కోలీవుడ్‌కు వచ్చిన ఈ అమ్మడు ఇక్కడ 49ఓ తదితర రెండు మూడు చిత్రాల తరువాత కురంగుబొమ్మై చిత్రంతో సక్సెస్‌ను అందుకుంది. బీఏ ఆంగ్ల లిటరేచర్‌తో పాటు జర్నలిజం కోర్స్ చేసిన డెల్నా డేవీస్ చదువుకునే రోజుల్లోనే పలు స్టేజీ ప్రోగామ్స్‌లో పాల్గొందట. అయితే కథానాయకిగా రాణిస్తానని గానీ అనుకోలేదట. ఒక స్టేజీ ప్రోగ్రామ్‌లో తీసిన ఫోటో చూసిన మలయళం దర్శకుడు సినిమాలో నటిస్తావా ? అని అడగటంతో తన నట జీవితం ఆరంభం అయ్యిందని చెప్పింది.
ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే గ్లామరస్‌గా నటించాల్సి ఉంటుంది. మరి నీ సంగతేమిటన్న ప్రశ్నకు నిజం చెప్పాలంటే గ్లామర్ అన్నది తన వంటికి సరిపడని అంశం అని పేర్కొంది. అయితే గ్లామర్కు తాను వ్యతిరేకిని కాదనీ, హోమ్లీ పాత్రలకే తన ప్రధాన్యత అని స్పష్టం చేసింది. ప్రముఖ హీరోలతో నటించేటప్పుడు ఈత దుస్తులు, లిప్ లాక్ సన్నివేశాలాంటి వాటిలో నటించాల్సి ఉంటుందిగా అంటే.. కథ విన్నసమయంలోనే ఈ విషయాల గురించి దర్శక నిర్మాతలతో చర్చిస్తానని అంది. నిజంగా కథకు అవసరం అనిపిస్తే అలా నటించడానికి తనకు అభ్యంతరం ఉండదని చెప్పింది.
రాజకీయ ఆసక్తి - రాజకీయాలపై ఆసక్తి మెండు అటగా అన్న ప్రశ్నకు అవును అందుకే బీఏ ఆంగ్ల లిటరేచర్ చదివాను అని బదులిచ్చింది. కొంత కాలం సినిమాల్లో నటించిన తరువాత కచ్చితంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని చెప్పింది.
ప్రేమ వివాహమే - సరే మరి పెళ్లి విషయం ఏమిటీ? లవా? ఎరెంజ్‌డా? అన్న ప్రశ్నకు కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటా. ఇటీవల ప్రేమలో పడ్డాననీ చెప్పింది. తనూ ఈ రంగానికి చెందిన వ్యక్తేననీ, అయితే అతనెవరన్నది సమయం వచ్చినప్పుడు చెబుతానని అంది. పెళ్లి కూడా వచ్చే ఏడాదిలోనే చేసుకుంటాననీ హీరోయిన్ డెల్నా డేవీస్ చెప్పింది.