సోద‌రి ప్రేమికుడిపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి | Dalit Man Attacked With Sword By Girlfriend Brother In Kerala | Sakshi
Sakshi News home page

సోద‌రి ప్రేమికుడిపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి

Jun 8 2020 6:36 PM | Updated on Jun 8 2020 7:26 PM

Dalit Man Attacked With Sword By Girlfriend Brother In Kerala - Sakshi

తిరువనంతపురం: త‌న సోదరిని ప్రేమిస్తున్నాడ‌న్న కారణంతో ద‌ళిత యువకుడిని ఓ వ్య‌క్తి క‌త్తితో పొడిచాడు. ఈ దారుణ ఘ‌ట‌న కేర‌ళ‌లో ఆదివారం చోటు చేసుకుంది. ఎర్నాకులంలోని మువ‌ట్టుపుఝకు చెందిన‌ 20 ఏళ్ల యువ‌కుడు, 18 ఏళ్ల యువ‌తి కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విష‌యం యువ‌తి సోదరుడికి తెలిసింది. ప్రేమ వ్య‌వ‌హారంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అత‌డు ద‌ళితుడిని మ‌ర్చిపోవాలంటూ సోద‌రిని మంద‌లించాడు. అయిన‌ప్ప‌టికీ వాళ్లిద్ద‌రూ ప్రేమ‌ను వదులుకోడానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ఇదిలా వుండ‌గా ఆదివారం సాయంత్రం యువ‌తిని ప్రేమించిన వ్య‌క్తి ఫేస్ మాస్కు కొనేందుకు ఓ దుకాణానికి వెళ్లాడు. (నటి చందన ఆత్మహత్య కేసు.. ప్రియుడు అరెస్ట్‌)

అక్క‌డికి చేరుకున్న యువ‌తి సోదరుడు అత‌డిని బ‌య‌ట‌కు ర‌మ్మ‌ని పిలిచాడు. దీంతో అత‌ను దుకాణంలో నుంచి బ‌య‌ట‌కు రాగానే క‌త్తి తీసుకుని విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. చేతులు, త‌ల‌, మెడ‌పై తీవ్ర గాయాలైన అత‌డిని కొట్టాయంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చేర్పించారు. ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉంది. మ‌రోవైపు‌ దాడిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన అత‌డి స్నేహితుడికి స్వ‌ల్ప‌ గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టారు. నిందితుడికి స‌హ‌కరించిన ప‌దిహేడేళ్ల‌ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. (నవవధువు అనుమానాస్పద మృతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement