
ఇటీవల దక్షిణాదిలో సంచలన విజయం సాధించిన సినిమా కేజీయఫ్. కన్నడ నటుడు యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సాండల్‌వుడ్‌లో మాత్రమే కాదు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఆకట్టుకుంది. దీంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. ముఖ్యంగా ప్రశాంత్ తెరకెక్కించిన హీరో ఎలివేషన్ సీన్స్ టాప్ హీరోలను కూడా కట్టిపడేశాయి.
కేజీయఫ్ సక్సెస్ తరువాత ప్రశాంత్‌కు స్టార్ హీరోల నుంచి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రశాంత్‌తో సినిమా చేసేందుకు సుముఖంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇప్పటికే ప్రశాంత్ నీల్, మహేష్‌తో చర్చలు జరిపారన్న వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఊరమాస్ స్టైల్ సినిమాలు చేసే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మహేష్ సినిమా చేస్తాడా..? చేస్తే ఎలాంటి కథతో చేస్తాడు? అన్న విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment