వినాయక్ బర్త్ డేకి మెగా గిఫ్ట్ | Khaidhi number 150 team special video for vinayak birthday | Sakshi
Sakshi News home page

వినాయక్ బర్త్ డేకి మెగా గిఫ్ట్

Published Sun, Oct 9 2016 10:22 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

వినాయక్ బర్త్ డేకి మెగా గిఫ్ట్

వినాయక్ బర్త్ డేకి మెగా గిఫ్ట్

మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ వివి వినాయక్ ప్రస్తుతం మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150కి దర్శకత్వం వహిస్తున్నారు. తొలిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారి అల్లు అరవింద్తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా చిరు 150వ సినిమా కూడా కావటంతో మేకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ ఆదివారం దర్శకుడు వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా యూనిట్ సభ్యులు ఓ వీడియోను రిలీజ్ చేశారు. మేకింగ్ విజువల్స్తో పాటు మెగాస్టార్ నుంచి డ్రైవర్ వరకు అందరూ వినాయక్కు శుభాకాంక్షలు తెలుపుతూ రూపొందించిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఖైదీ నంబర్ 150 సినిమా ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement