‘కత్తి’లాంటి పూర్తి కమర్షియల్ చిత్రం | VV Vinayak Interview About Megastar Chiranjeevi 150 movie | Sakshi
Sakshi News home page

‘కత్తి’లాంటి పూర్తి కమర్షియల్ చిత్రం

Published Fri, Apr 29 2016 1:39 AM | Last Updated on Sun, Jul 14 2019 1:57 PM

‘కత్తి’లాంటి పూర్తి కమర్షియల్ చిత్రం - Sakshi

‘కత్తి’లాంటి పూర్తి కమర్షియల్ చిత్రం

ఎటువంటి రాజకీయ సన్నివేశాలు ఉండవు
చిరంజీవితో సినిమాపై దర్శకుడు వీవీ వినాయక్
నేడు హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం

 
 మలికిపురం : తాను దర్శకత్వం వహించే  మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో ఎటువంటి రాజకీయ సన్నివేశాలు ఉండవని, ఇది ‘కత్తి’లాంటి పూర్తి కమర్షియల్ చిత్రంగానే రూపొందుతుందని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ స్పష్టం చేశారు. మలికిపురంలో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.  తమిళంలో హిట్ అయిన కత్తి సినిమాను తెలుగులో ‘కత్తి’ ఉప శీర్షిక లాంటోడు పేరుతో శుక్రవారం హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు.
 
  తనపై ఉన్న నమ్మకంతో 150వ సినిమా బాధ్యతలు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తొలిసారిగా కొణిదెల క్రియేషన్స్ బేనర్‌లో హీరో రామ్‌చరణ్ నిర్మాత గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఠాగూర్ చిత్రంమాదిరి చక్కటి సందేశం కూడా ఉంటుందన్నారు. అద్భుతమైన పాటలు, ఫైట్‌లతో చిరంజీవి అభిమానులను అలరిస్తారన్నారు. హీరోయిన్ ఎంపిక  జరగలేదని, సంగీతం దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తారన్నారు. అత్యాధునిక సాంకేతిక విలువలతో  మే చివరి వారం నుంచి తొలిషెడ్యూల్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement