డిజిటల్‌ ప్లాట్‌ ఫాంలో సీరత్‌ కపూర్‌ మూవీ | Krishna And His Leela Movie Released On Digital OTT Platform | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ ప్లాట్‌ ఫాంలో సీరత్‌ కపూర్‌ మూవీ

Published Tue, May 26 2020 4:35 PM | Last Updated on Tue, May 26 2020 5:39 PM

Krishna And His Leela Movie Released On Digital OTT Platform - Sakshi

టాలీవుడ్‌లో మరో సినిమా ఓటీటీ ప్లాట్‌ ఫాం ద్వారా విడుదలకు సిద్ధమైంది. ఇక దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన వేళ ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యారు. పలు సినిమాల విడుదల, షూటింగ్‌లు నిలిచిపోయాయి. థియేటర్లు అన్ని మూతపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది చిత్ర నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ ఫాం ద్వారా తమ చిత్రాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. తాజాగా హీరోయిన్‌ సీరత్‌ కపూర్‌  ఓ ఇంటర్వ్యులో మాట్లాడుతూ.. తాను నటిస్తున్న ఓ సినిమాను ఓటీటీ ప్లాట్‌ ఫాం ద్వారా విడుదల చేయనున్నట్లు  తెలిపారు. ‘అభిమానులు సినిమాను థియేటర్లకు వెళ్లి చూడటానికి ఇష్టపడుతారు. కానీ ఇప్పుడున్న కష్టకాలంలో ఓటీటీ ప్లాట్‌ ఫాం మీద దృష్టి పెట్టాము. ప్రస్తుతం ఇదే మంచి అవకాశంగా కనిపిస్తోంది’ అని సీరత్‌ కపూర్‌ చెప్పుకొచ్చారు. 

ఇప్పటికే  సీరత్‌ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా, మా వింత గాథ వినుమా’ సినిమాలు విడుదలకు సిద్ధమైనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాల్లోని ఒక సినిమాను ఓటీటీ ప్లాట్‌ ద్వారా విడుదల చేస్తారా? లేదా తాను నటిస్తున్న మరో మూవీని విడుదల చేస్తారా అన్న దానిపై స్పష్టత లేదు. ‘రన్‌ రాజా రన్‌’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన సీరత్‌​ కపూర్‌.. ‘టైగర్‌’, ‘రాజుగారి గది 2’, ‘ఒక్క క్షణం’, ‘టచ్‌ చేసి చూడు’ వంటి చిత్రాల్లో ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే నటనను కనబరిచారు. ఇప్పటికే టాలీవుడ్‌లో అమృత‌‌రామ‌మ్‌ మూవీ ఓటీటీ ప్లాట్‌ ఫాం ద్వారా విడుదలైన విషయం తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement