
వీళ్లు చాలా డేర్ గురూ!
ఇక్కడున్న ఫొటోలను చూస్తే త్రిష, లక్ష్మీ రాయ్ చాలా డేరింగ్ అనిపిస్తోంది కదూ! వేగంగా దూసుకెళుతున్న కారులో బుద్ధిగా కూర్చోకుండా, డోర్ పట్టుకుని వెళాడుతున్నారు త్రిష. ‘మోహిని’ షూటింగ్ కోసం ఇటీవల ఆమె లండన్ వెళ్లారు. ఓ సన్నివేశంలో భాగంగా ఇలా వాహనాన్ని పట్టుకుని వేలాడాల్సి వచ్చింది. ఈ సీన్‌ని త్రిష చాలా ధైర్యంగా చేశారు.
ఇక లక్ష్మీరాయ్ విషయానికొస్తే.. రోడ్డు పక్కన ఆగి ఉన్న జీపులో నిలబడి చిరునవ్వులు చిందిస్తున్నారామె. జీపు పరిగెడుతున్న సమయంలోనూ ఈవిడగారిది ఇదే వరస. ‘ఇలా నిలబడటం మావల్ల కాదు.. భయంగా ఉంది’ అని స్నేహితులు గగ్గోలు పెట్టడంతో జీపుని పక్కన ఆపించారు లక్ష్మీరాయ్.
స్నేహితులతో కలసి సాహస యాత్ర వెళ్లారామె. ఈ ట్రిప్‌లో బోల్డన్ని సాహసాలు చేయాలని నిర్ణయించుకున్నారట. సినిమా షూటింగ్‌లో భాగంగా అయినా, హాలిడే ట్రిప్ అయినా అందాల భామలు ఇలా ధైర్యసాహసాలు ప్రదర్శిస్తుంటే ‘వీళ్లు చాలా డేర్ గురూ’ అనాలనిపిస్తోంది కదూ!