ప్రేమించాలా.. వద్దా? | Love cheyala vadda movie | Sakshi
Sakshi News home page

ప్రేమించాలా.. వద్దా?

Published Mon, Feb 15 2016 5:55 PM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

ప్రేమించాలా.. వద్దా?

ప్రేమించాలా.. వద్దా?

‘‘చిన్న సినిమాలు విజయవంతం అయితేనే మరికొంత మంది నిర్మాతలు చిత్రాలు తీసేందుకు ముందుకు వస్తారు. వైజాగ్‌కు చెందినవారంతా ఈ చిత్రం నిర్మించారు. వైజాగ్ కూడా సినిమా హబ్ కావాలి’’ అని దర్శక- నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. జి. నౌషాద్ దర్శకత్వంలో జీకే సినిమాస్ పతాకంపై జీవీ రమణ, సి. సంతోష్ కుమారి నిర్మించిన చిత్రం ‘లవ్ చెయ్యాలా వద్దా?’. గౌతమ్ డానీ అందించిన ఈ చిత్రం పాటలను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ‘‘చిన్న సినిమాలు సక్సెస్ అయితే చాలామంది స్ఫూర్తి పొంది మరిన్ని చిత్రాలు తీసేందుకు ముందుకొస్తారు’’ అని దర్శకుడు కల్యాణ్ కృష్ణ అన్నారు.

హీరో కార్తీక్ మాట్లాడుతూ- ‘‘నేను పదో తరగతి చదువుతున్నప్పుడు వచ్చిన ‘ఇడియట్’ చిత్రం చూసి అమ్మాయిలతో ర్యాష్‌గా ప్రవర్తించేవాణ్ణి. అప్పుడు జరిగిన ఓ సంఘటన తర్వాత ఇక ర్యాష్‌గా ఉండటం మానేశా. ఇప్పుడీ చిత్రంలో అటువంటి పాత్రనే చేశా’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement