దెయ్యంతో ప్రేమ | love with ghost | Sakshi
Sakshi News home page

దెయ్యంతో ప్రేమ

Published Mon, Jun 22 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

దెయ్యంతో ప్రేమ

దెయ్యంతో ప్రేమ

ఓ అందమైన అమ్మాయి తమను ప్రేమిస్తే బాగుంటుందని చాలా మంది అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు. వాళ్లల్లో ఓ యువకుణ్ణి నిజంగానే దెయ్యం ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సాహసం సేయరా డింభకా’. శ్రీ, హమీద, సమత ముఖ్య తారలుగా తిరుమలశెట్టి కిరణ్ దర్శకత్వంలో ఎమ్మెస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ వసంత్ పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ప్రచార చిత్రాన్ని ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ- ‘‘కొన్నేళ్ల క్రితం రేలంగి నరసింహారావు గారి దర్శకత్వంలో ‘సాహసం సేయరా డింభకా’ అనే చిత్రంలో నటించాను. మళ్లీ అదే పేరుతో నా స్నేహితుడు,  నిర్మాత ఎమ్మెస్ రెడ్డి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. శ్రీ, హమీద, సమత తదితరలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement