Minister talasani Srinivasa Yadav
-
సభ్యత్వ రుసుము తగ్గించాలి - నాగబాబు
‘‘గత ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల వాతావరణాన్ని తలపించాయి. ఈసారి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. కృష్ణ, చిరంజీవి వంటి పెద్దల ఆధ్వర్యంలో ‘మా’కు బీజం పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ‘మా’కు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాం’’ అని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. నటుడు శివాజీరాజా అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నికైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన కార్యవర్గం చేత ఆదివారం తలసాని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ‘మా’ తరఫున దర్శకుడు కె. విశ్వనాథ్, నటి శారదలను కృష్ణ, విజయనిర్మల దంపతులు సన్మానించారు. ‘‘ఈ వేదికపై దాసరిగారు లేకపోవడం ఏదో వెలితిగా ఉంది’’ అన్నారు కె. విశ్వనాథ్. ‘‘వృద్ధ కళాకారులకు ప్రభుత్వం తరఫున రూ. 1000 పెన్షన్ అందిస్తాం. పేద కళాకారులకు రేషన్ కార్డులు అందించే ఆలోచన ఉంది’’ అన్నారు తలసాని. ‘‘లక్ష రూపాయలుగా ఉన్న ‘మా’ సభ్యత్వ రుసుమును తగ్గించాలని కోరుతున్నా’’ అన్నారు నటుడు నాగబాబు. ‘‘ఈ నెల నుంచి పెన్షన్‌ను 25 శాతం పెంచుతున్నాం’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. ఈ వేదికపై కొందరు ‘మా’ సభ్యులు, సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావుకు ద్విచక్ర వాహనాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ నూతన కార్యవర్గం, సభ్యులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి చేప పిల్లల పంపిణీ: తలసాని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి 15 వరకు చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. శనివారం మత్స్యశాఖ అధికారులు, సహకార సంఘాల సభ్యులతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 8 పెద్ద, 17 మధ్య స్థాయి, 53 చిన్న రిజర్వాయర్లు, 35,031 చెరువులు ఉన్నాయని.. వాటిలో 4,553 చెరువులు, రిజర్వాయర్లలో 48 కోట్ల వ్యయంతో 34.63 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. -
వంద ఎకరాల్లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్
* అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తాం: తలసాని * చలనచిత్ర అభివృద్ధిపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: చలనచిత్ర రంగం అభివృద్ధికి రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో చలనచిత్ర అభివృద్ధి శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చలనచిత్ర రంగంపై ఆధారపడిన వారిని ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి వంద ఎకరాల భూమిని సేకరించనున్నట్లు తెలిపారు. అందులో శిక్షణ నిమిత్తం దేశ విదేశాల నుంచి వచ్చేవారికీ వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. తక్కు వ బడ్జెట్ చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని, నెలాఖరులోగా ఐదో షో ప్రదర్శనకు అనుమతించాలని నిర్ణయించామని చెప్పారు. అనుమతుల కోసం సింగిల్ విండో సినిమా షూటింగులకు అవసరమైన అనుమతులను రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) ద్వారా ఇచ్చేలా సింగిల్ విండో విధానానికి రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. దరఖాస్తు చేసిన ఏడు రోజుల్లోగా అనుమతి వస్తుందని, గడువులోగా అనుమతులు జారీ కాని పక్షంలో 8వ రోజు నుంచి చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్లో టికెట్ల అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. వాణిజ్య ప్రాంతాలు, బస్‌డిపోలు, ప్రభుత్వ సముదాయాల్లో 200 సీట్ల సామర్థ్యంతో మినీ థియేటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. నంది అవార్డుల పేరును మార్చడంపై ప్రభుత్వ సలహాదారు రమణాచారి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ త్వరలోనే సమావేశమై చర్చించనుందని తెలిపారు. చిత్రపురి కాలనీలో 4,300 మంది సినీ కార్మికులకు ఇళ్ల నిర్మాణం జరుగుతోందని.. ఆ కాలనీలో ఆసుపత్రి, రహదారులు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు మరో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
సాయిధరమ్ తేజ్ స్టార్‌గా ఎదుగుతాడు
- సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ‘‘సుప్రీమ్ సినిమా చూశాను. ముఖ్యంగా ఇందులో మానసిక వికలాంగులతో తీసిన యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్‌గా ఎదుగుతాడు’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. సాయిధరమ్‌తేజ్, రాశీఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘సుప్రీమ్’ సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ‘‘ఈ సినిమాలో చాలా సీన్స్‌లో సాయిధరమ్ మా అన్నయ్య చిరంజీవిని గుర్తు చేశాడు’’ అని సాయికుమార్ అన్నారు, ‘‘ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అనిల్‌కే దక్కుతుంది. పేపర్ వర్క్ లేకుండా నాతో ఈ సినిమా చేయించాడు’’ అని రాజేంద్రప్రసాద్ చెప్పారు. ‘‘దర్శకుడు అనిల్ ఇన్పుట్స్తోనే బాలు అనే క్యారెక్టర్‌ను బాగా చేయగలిగా. రాజేంద్రప్రసాద్‌గారు, మిఖేల్, నా కాంబినేషన్లో వచ్చే సీన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది’’ అని సాయిధరమ్ తేజ్ చెప్పారు. ‘‘నటీనటులందరూ వానరసైన్యంలా సపోర్ట్ చేశారు’’ అని అనిల్ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ క్లైమాక్స్ ఫైట్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. ఇంకా ఈ వేడుకలో నటులు ‘వెన్నెల’ కిశోర్, శ్రీనివాసరెడ్డి, రాశీఖన్నా తదితరులు పాల్గొన్నారు. -
ఏమన్నా మాట్లాడితే జగన్‌కు అనుకూలమంటున్నారు
- అసెంబ్లీ లాబీలో మంత్రి తలసాని ఆసక్తికర వాఖ్యలు సాక్షి, హైదరాబాద్: ‘వాస్తవాలు మాట్లాడితే టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. నేనేం మాట్లాడినా వైఎస్ జగన్మోహన్రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. మీరొకసారి నాతో ఏపీ లాబీల్లోకి వచ్చినా పక్కన నిలబడి గమనించండి. ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంత కోపం, ఎంత అసంతృప్తి ఉన్నాయో అర్థమవుతుంది’ అని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఏపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయంపై స్పందిస్తూ ‘గోరుతో పోయేదాన్ని.. గొడ్డలి దాకా తెచ్చుకున్నారు’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బాబు తీరు గురించి మాట్లాడితే జగన్‌కు అనుకూలంగా మాట్లాడానని భావిస్తున్నారని, నిజాలు మాట్లాడడానికి ఎవరైతే ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ నేత ఒకరు దొరికిన దొంగ అని, ఆ నాయకుని గురించి ఎక్కువగా స్పందించదలుచుకోలేదని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
‘సీమాంధ్రులకు తెలంగాణ బాధ్యతలు ఇవ్వొద్దు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సీమాంధ్రులకు కాకుండా తెలంగాణ అధికారులకు అవకాశం కల్పిం చాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు, ఎన్జీవో సంఘం అధ్యక్షుడు వేణుగోపాల రావు శుక్రవారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీని వాసయాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రాకు వినతి పత్రాలు సమర్పించారు. తెలంగాణ ఏర్పడి 20 నెలలు దాటినా ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతులు కల్పించడం లేదన్నారు. హైదరాబాద్‌లో సంయుక్త కమిషనర్ హోదాలో ఉన్న ఓ సీమాంధ్ర అధికారి ప్రభుత్వ ఓఎస్డీగా పదోన్నతి కోసం పైరవీలు చేసుకుంటుండగా, ఆయనకు అనుకూలంగా వ్యవహారాలు సాగుతున్నాయన్నారు. ప్రాముఖ్యత గల పోస్టులను సీమాంధ్ర అధికారులకు కేటాయించి అప్రధానమైన స్థానాల్లో తెలంగాణ వారిని నియమిస్తున్నారని పేర్కొన్నారు. -
క్రమబద్ధీకరణకు ఇదే ఆఖరి అవకాశం
♦ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ♦ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని స్పష్టీకరణ హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూములు, ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలు భవిష్యత్‌లో ఉండవని, ఇదే ఆఖరి అవకాశం అని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బోయిన్‌పల్లిలోని కూరగాయల రిటైల్ మార్కెట్ గుండా కోజా ముస్లిం గ్రేవ్ యార్డుకు వెళ్లే దారి వివాదం నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని శనివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే సాయన్న, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా తలసాని విలేకరులతో మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను డబ్బులు వసూలు చేయాలన్న భావనతో కాకుండా పేదలకు న్యాయం జరిగేలా వినియోగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని, ఈ నేపథ్యంలో ఆయా పథకాల ద్వారా క్రమబద్ధీకరణ కోసం పేదల నుంచి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆక్రమణలతోనే తంటా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.25 వేల కోట్లతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారని తలసాని తెలిపారు. ఇందులో భాగంగానే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. 1.5 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా మొత్తం 425 యూనిట్లలో రెండు విడతలుగా చేపట్టిన కార్యక్రమాల్లో గుర్తించిన పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ మేరకు రూ.200 కోట్లతో వివిధ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్‌లో నాలాలు, రోడ్లు ఆక్రమణలకు గురికావడం అభివృద్ధికి ఆటంకంగా మారిందని తలసాని అన్నారు. వీలైనంత వరకు ఆయా స్థలాల్లో అక్రమ కట్టడాలను తొలగించే ప్రయత్నాలు చేస్తామని, అదే సమయంలో నిరుపేదలకు అన్యాయం జరగకుండా చూస్తామని, ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్ రూమ్ స్కీము ద్వారా పునరావాసం కల్పిస్తామని వెల్లడించారు. -
కాంగ్రెస్ నేతల్లా దొంగ పనులు చేయం
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతల మాదిరిగా తాము కుంభకోణాలు, దొంగ పనులు చేయడంలేదని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకున్న కాంగ్రెస్ పార్టీకి తమను విమర్శించే అర్హతలేదన్నారు. సచివాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో అడ్వాన్స్ పేమెంట్లు తీసుకోవడం కాంగ్రెస్ నేతలకే అలవాటని తలసాని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు ఉందని, అందులో భాగంగా ఆ పార్టీ నాయకులు తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిపట్ల కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వద్దకెళ్లి కర్ణాటకలోని అక్రమ ప్రాజెక్టులను ఆపించాలన్నారు. మద్యం పాలసీ విషయంలో అన్నిపార్టీల నేతలు కావాలనే రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ప్రజలకు మంచి నీళ్లు ఇవ్వకుండా మద్యం సరఫరా చేస్తోందా? అని ప్రశ్నించారు. ఏపీలో విచ్చలవిడిగా బెల్టుషాపులు కొనసాగుతున్న వైనం టీడీపీ నేతలకు కనిపించడం లేదా? గుజరాత్లో ప్రతి పాన్‌షాప్‌లో లిక్కర్ దొరుకుతుందనే విషయం బీజేపీ నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు.. ఏడాదైనా ఏపీలో ఎందుకు కొత్త రాజధానిని నిర్మించలేకపోతున్నారని ప్రశ్నించారు. -
దెయ్యంతో ప్రేమ
ఓ అందమైన అమ్మాయి తమను ప్రేమిస్తే బాగుంటుందని చాలా మంది అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు. వాళ్లల్లో ఓ యువకుణ్ణి నిజంగానే దెయ్యం ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సాహసం సేయరా డింభకా’. శ్రీ, హమీద, సమత ముఖ్య తారలుగా తిరుమలశెట్టి కిరణ్ దర్శకత్వంలో ఎమ్మెస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ వసంత్ పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ప్రచార చిత్రాన్ని ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ- ‘‘కొన్నేళ్ల క్రితం రేలంగి నరసింహారావు గారి దర్శకత్వంలో ‘సాహసం సేయరా డింభకా’ అనే చిత్రంలో నటించాను. మళ్లీ అదే పేరుతో నా స్నేహితుడు, నిర్మాత ఎమ్మెస్ రెడ్డి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. శ్రీ, హమీద, సమత తదితరలు పాల్గొన్నారు. -
16 నుంచి ‘స్వచ్ఛ హైదరాబాద్’
సీఎం, గవర్నర్‌తో సహా 33,500 మంది సిబ్బంది పాల్గొంటారని మంత్రి తలసాని వెల్లడి హైదరాబాద్: ప్రస్తుతం కోటికిపైగా జనాభా ఉన్న మహానగరంలో ఎక్కడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే లక్ష్యంతో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు ‘స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా తాగునీరు, రహదారులు, ట్రాఫిక్ సమస్యలు, మురుగునీటి పారుదల.. తదితర సమస్యలన్నింటికీ స్వచ్ఛ హైదరాబాద్ పరిష్కారం చూపనుందన్నారు. ఈ కార్యక్రమంలో 33,500 మంది వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొంటారన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను 400 భాగాలుగా విభజించి, ప్రతి విభాగానికి ఒక బృందం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేలా ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో బృందంలో 15 మంది సభ్యులు ఉంటారని, వీరిలో బిల్కలెక్టర్లు, రెవెన్యూ, విద్యుత్, జీహెచ్ఎంసీ, వాటర్‌వర్క్స్, శానిటేషన్ సిబ్బంది ఉంటారని చెప్పారు. ముఖ్యమంత్రి, గవర్నర్‌తో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. మొత్తం ప్రభుత్వం యంత్రాంగమంతా ప్రజలముందుకు వెళుతోందన్నారు. అప్పటికప్పుడు పరిష్కరించగల సమస్యల (వీధిలైట్లు, ఆట వస్తువులు, ఈ-లైబ్రరీలు, పార్కుల్లో సదుపాయాలు.. తదితర) కోసం ప్రతి బృందానికి రూ.50 లక్షల నిధులు కేటాయించామన్నారు. శానిటేషన్ నిమిత్తం 700 వాహనాలను సిద ్ధం చేశామన్నారు. ఇందులో కాలనీల వాసులు, బస్తీ కమిటీలు, స్చచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు. అలాగే.. ఆయా ప్రాంతాల్లో అర్హులకందాల్సిన పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు, షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలకు సంబంధించి ఫిర్యాదులను కూడా అధికారులు స్వీకరిస్తారని మంత్రి తలసాని తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ గురించి మరిన్ని వివరాలు, సూచనల కోసం కాల్ సెంటర్(040-21111111)ను కూడా ఏర్పాటు చేశామన్నారు. రేపు ‘స్వచ్ఛ హైదరాబాద్’పై సీఎం కేసీఆర్ సమీక్ష హైదరాబాద్: ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహణపై చర్చించేందుకు ఈనెల 14న సచివాలయంలో హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన సమత బ్లాక్‌లో ఈ సమావేశం జరుగుతుంది. అన్ని పార్టీలు.. నగరానికి చెందిన ప్రతి ఒక్కరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ సిటీని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే అంశాలపై ఇందులో చర్చిస్తారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతోపాటు హైదరాబాద్‌కు చెందిన రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ, హనుమంతరావు, ఎంఏ ఖాన్, కె.కేశవరావు, సీహెచ్.మల్లారెడ్డిలతో పాటు అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలు, నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, కంటోన్మెంట్ వైస్ చైర్మన్, సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. -
యాదవులంతా ఐక్యంగా ఉండాలి: తలసాని
హైదరాబాద్: యాదవులంతా కలసికట్టుగా ఉండాలని, ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. నాగోలు శుభం కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన అఖిల భారత యాదవమహాసభ రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తల సాని మాట్లాడుతూ యాదవుల పండుగైన శ్రీకృష్ణాష్టమి, దసరా, సదర్ మేళాలు, అలై బలై వేడుకలను అన్ని జిల్లాల్లో నిర్వహించాలని సూచించారు. చంద్రబాబు తెలంగాణలోని బీసీలను మోసం చేశారని, సీఎం అభ్యర్థికి కనీసం ఫ్లోర్‌లీడర్ పదవి కూడా ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్, మార్కెటింగ్ డెరైక్టర్లు, దేవాలయ కమిటీ, యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్లుగా అవకాశం కల్పించాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో బి.బాబురావుయాదవ్, అశోక్‌కుమార్‌యాదవ్, ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్, లక్ష్మణ్‌యాదవ్, జైపాల్‌యాదవ్, నోముల నర్సింహయ్యయాదవ్ పాల్గొన్నారు.