సల్మాన్కు ఫైనల్ వార్నింగ్ | Maharashtra women's panel's final summon to Salman Khan | Sakshi
Sakshi News home page

సల్మాన్కు ఫైనల్ వార్నింగ్

Published Fri, Jul 8 2016 9:13 AM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM

సల్మాన్కు ఫైనల్ వార్నింగ్ - Sakshi

సల్మాన్కు ఫైనల్ వార్నింగ్

ముంబయి: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మహారాష్ట్ర మహిళా కమిషన్ ప్యానెల్ తుది హెచ్చరికలు చేసింది. తమ ముందుకు ఎట్టి పరిస్థితుల్లో హాజరుకావాలని, ఇదే చివరి అవకాశం అని హెచ్చరిస్తూ సమన్లు పంపించింది. గతంలో ఇచ్చిన సమన్లు పట్టించుకోకపోవడం లెక్కలేనితనమే అని ఈ సందర్భంగా ఆ ప్యానెల్ పేర్కొంది. సుల్తాన్ సినిమా షూటింగ్ కు వెళ్లొచ్చిన అనంతరం తన పరిస్థితి లైంగికదాడికి గురైన మహిళలా ఉందని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది.

ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. దీనికి సంబంధించి తమకు వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ సమన్లు పంపించింది. మొత్తం రెండుసార్లు ఈ నోటీసులు పంపించినా ఆయన హాజరుకాలేదు. దీంతో మూడో సమన్ పంపిస్తూ ఇదే చివరిదని పేర్కొంది. దీనికి కూడా ఆయన బదులు ఇవ్వకుంటే బెయిలబుల్ వారెంట్ ఇచ్చే అవకాశం ఉంది. పండుగ నేపథ్యంలో ఆయన రాకపోయినా కనీసం ఒక ప్రతినిథిని అయినా పంపించాల్సిందని, అలా కాకుండా ఆయన నుంచి బదులే లేని నేపథ్యంలో తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement