
మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' టీజర్ వచ్చేసింది
శ్రీమంతుడు సినిమాతో సంచలన విజయం నమోదుచేసిన మహేష్ బాబు, త్వరలో బ్రహ్మోత్సవం చేయడానికి రెడీ అవుతున్నాడు. అందులోభాగంగా తన అభిమానులకు కొత్త సంవత్సర కానుకను అందించాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం సినిమా ఫస్ట్ లుక్ టీజర్ను ఈరోజు (శుక్రవారం) ఉదయం 9.36 నిమిషాలకు రిలీజ్ చేశారు. పూర్తి ఫ్యామిలీ వాతావరణంలో తెరకెక్కిన పెళ్లి పాటలో మహేష్ మరింత అందంగా కనిపిస్తున్నాడు. మహేష్తో పాటు చిత్రంలోని ఇతర నటీనటులను కూడా పరిచయం చేసిన ఈ టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. భారీ హిట్ తరువాత మహేష్ చేస్తున్న సినిమా కావటంతో బ్రహ్మోత్సవం పై భారీ అంచనాలు ఉన్నాయి.
గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో కూల్ హిట్ అందుకున్న మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పివిపి సినిమాస్ బ్యానర్‌తో కలిసి మహేష్ స్వయంగా బ్రహ్మోత్సవాన్ని నిర్మిస్తున్నాడు.
Here it is.. The very first teaser of Brahmotsavam! Wish you all a very Happy New Year.. Enjoy :) https://t.co/LQPydgiEG4
— Mahesh Babu (@urstrulyMahesh) January 1, 2016