
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజున సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోయింది. ట్వీట్స్, విషెస్‌తో నిన్నంతా మహేష్ ట్రెండ్ నడిచింది. దానికి తోడు మహేష్ 25వ సినిమా టైటిల్, టీజర్‌ను విడుదల చేశారు. ‘మహర్షి’ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
అయితే ఈ టైటిల్‌పై మహేష్ ఫ్యాన్స్ మాత్రం తెగ రీసెర్చ్ చేస్తున్నారు. ఈ మూవీలో మహేష్ పేరు రిషి అని తెలిసిందే కాబట్టి, హీరోయిన్ పేరు మహ అయ్యుండొచ్చంటూ ఊహించేసుకుంటున్నారు. ఇక సినిమా టైటిల్‌ను నిశితంగా పరిశీలిస్తే.. పైన ఊరి వాతావరణం కనబడుతోంది. కింద సీటీలో ఉండే భవనాల మాదిరి కనిపిస్తున్నాయని అంతేకాకుండా.. మూవీ టైటిల్ చివరన( ‘ష’ వొత్తు చివరన) స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనబడుతుందని.. ఇది అమెరికా-పల్లెటూరికి సంబంధించిన సినిమా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా.. మహేష్ అభిమానులు మాత్రం టీజర్‌తో పండుగ చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment