
‘భరత్ అనే నేను’ మూవీ తరువాత సూపర్‌స్టార్ మహేష్ బాబు చేస్తోన్న చిత్రం ‘మహర్షి’. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్‌తో ప్రిన్స్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మహర్షిపై రోజురోజుకు క్రేజ్ పెరిగి పోతుండగా.. ఈ మధ్యే చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే.
మహర్షి చిత్రంలోని గ్రామీణ నేపథ్యంలో ఉండే సన్నివేశాల చిత్రీకరణ నిమిత్తం చిత్రయూనిట్ పొల్లాచ్చిలో గత కొన్నిరోజులుగా షూటింగ్ చేస్తోన్న తెలిసిందే. అయితే ఈ షెడ్యుల్ నేటితో పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు. ఫిబ్రవరిలో మరో షెడ్యుల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం నుంచి మరో టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డె కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో అల్లరి నరేష్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.