
సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ‘మహర్షి’ టీజర్ ట్రెండింగ్ అవుతోంది. ఒక్కొ అక్షరాన్ని విడుదల చేస్తూ.. సినిమా టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ చేసిన సర్‌ప్రైజ్‌కు అభిమానుల్లో ఆసక్తి రేగింది. దానికి తగ్గట్టుగా టైటిల్, టీజర్‌ను రిలీజ్ చేసేసరికి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
సోషల్ మీడియా మొత్తం మహేష్ బాబు ట్రెండింగ్ నడుస్తోంది. మహేష్ బర్త్ డే విషెస్, మహర్షి టీజర్‌లు ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ టీజర్‌ను ఇప్పటికే రెండు మిలియన్ల మంది వీక్షించారు. మహేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఈ 25వ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ఉగాదికి రిలీజయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment