భరత్ రామ్‌కు చిన్నతనంలో వాళ్ల అమ్మ ఒక మాట చెప్పింది. ‘ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే నువ్వు మనిషిగా పిలవబడవు’ అని. ఎప్పటికీ ఆ మాటను తప్పలేదు, మర్చిపోలేదతను. పెద్దదే కాదు. కష్టమైందన్నప్పటికీ రాష్ట్రానికి సీయంగా జీవితంలో పెద్ద ప్రామిస్ చేశాడు భరత్. మరి..ఈ ప్రామిస్‌లో కూడా భరత్ ఎలా సక్సెస్ అయ్యాడో తెలుసుకోవాలంటే మాత్రం ‘భరత్ అనే నేను’ సినిమా చూడాల్సిందే. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’.
కియారా అద్వాని కథానాయిక. ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీయం భరత్ రామ్ పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఈ సినిమా టీజర్ ‘ది విజన్ ఆఫ్ భరత్’ ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోని లోపాలపై భరత్ గురిపెడతారట..మరి...ప్రతి ఒక్కరికి భయం..బాధ్యత ఉండాలి అంటున్న భరత్ ఎప్పుడు చార్జ్ తీసుకుంటున్నాడో తెలుసుగా! నెక్ట్స్ మంత్‌లోనే. అదేనండి..ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదల చేయబోతున్నారు అని చెప్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment