మహేశ్ బర్త్ డే గిఫ్ట్ గా ట్రైలర్ విడుదల!
మహేశ్ బర్త్ డే గిఫ్ట్ గా ట్రైలర్ విడుదల!
Published Wed, Aug 7 2013 11:54 PM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
ప్రిన్స్ మహేశ్ బాబు బర్త్ డే గిఫ్ట్ గా 1: నేనొక్కడినే చిత్ర ట్రైలర్ ను విడుదల చేయడానికి నిర్మాతలు సిద్దమవుతున్నారు. శుక్రవారం ఆగస్టు 9 తేదిన మహేశ్ 38 జన్మదినం జరుపుకోనున్నారు. మహేశ్ జన్మదినం సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేస్తున్నాం. ఆయన జన్మదినం సందర్భంగా ట్రైలర్ ను గిఫ్ట్ గా ఇవ్వనున్నామని చిత్ర నిర్మాతలు తెలిపారు.
కొద్ది నెలల క్రితం మహేశ్ త్రండి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ కు అభిమానుల నుంచి అశేష స్పందన లభించింది. తన 38వ జన్మదిన వేడుకను ఈసారి మహేశ్ లండన్ లో జరుపుకోనున్నారు. ఇటీవల తన కూతురు సితార జన్మదినాన్ని కూడా మహేశ్ లండన్ లో జరుపుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
Advertisement
Advertisement