
మహేశ్ సినిమాలో జాకీ చాన్?
'పోకిరి', 'బిజినెస్ మేన్'తో హీరో మహేశ్ బాబు, దర్శకుడు పూరి జగన్నాథ్లది హిట్ కాంబినేషన్ అని ప్రూవ్ అయింది. ఈ కాంబినేషన్లో మూడో చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని పూరి పేర్కొన్నారు. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ స్లార్ నటిస్తారని ఆయన తెలిపారు. అయితే, ఆ స్టార్ ఎవరనేది పూరి చెప్పలేదు.
ఫిలింనగర్లో ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం ఆ స్టార్ ఎవరోకాదు.. మార్షల్ ఆర్ట్స్ చిత్రాల కథానాయకుడు జాకీ చాన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం జాకీ చాన్ నటిస్తున్న 'కుంగ్ ఫూ యోగా'లో సోనూ సూద్ నటిస్తున్నారు. తెలుగులో సోనూ కెరీర్కి మంచి బ్రేక్ అయిన చిత్రం పూరీ దర్శకత్వం వహించిన 'సూపర్'. ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. సోనూ ద్వారానే జాకీతో పూరి సంప్రతింపులు జరుపుతున్నారట.