మహేశ్‌బాబు
ఖతమ్ చేశారు... విలన్స్‌ను కుమ్మేసి, వారి చెడు ఆలోచనలను ఖతమ్ చేశారు హీరో మహేశ్‌బాబు. బ్యాలెన్స్ వర్క్‌ని కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’.
ఇందులో కియారా అద్వాని కథానాయిక. పబ్లిక్ మీటింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫైట్ సీన్స్‌తో సహా ఈ సినిమా క్లైమాక్స్ షూట్‌ను కంప్లీట్ చేశారు. బ్యాలెన్స్ ఉన్న కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఈ నెల 8 వరకు కొనసాగనుందట. ఈ చిత్రంలో సీయం భరత్ పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment