
సంఘ విద్రోహక శక్తుల భరతం పడతా అంటున్నారు భరత్. అనటమే కాదు అదే పనిలో పడ్డారు కూడా. అసలు భరత్ ఎవరు? ఎవరి అంతం చూస్తాడు అనుకుంటున్నారా? మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘భరత్ అనే నేను’ (పరిశీలనలో ఉన్న టైటిల్). ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్స్‌ను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ సారధ్యంలో చిత్రీకరిస్తున్నారు. కేరళలోని పొల్లాచ్చిలో కొన్ని ఫైట్స్ తీశారు.
బ్యాలెన్స్ సీన్స్‌ను తమిళనాడులోని కారైకుడిలో ప్లాన్ చేశారు. ఈ 25 వరకు కారైకుడిలో ఈ షెడ్యూల్ జరుగుతుందట. మహేశ్ – కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’లో ఫైట్స్‌ను అనల్ అరసు సారధ్యంలో ఇక్కడే షూట్ చేశారు. సేమ్ ప్లేస్.. సేమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 25 తర్వాత చిత్రబృందం హైదరాబాద్ చేరుకుంటుంది. వచ్చే నెల హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలవుతుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 27న సినిమా రిలీజ్ అనుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయిక.
అరకోటి అభిమానులు
మహేశ్‌బాబు తరచూ ట్విట్టర్ ద్వారా తన కొత్త సినిమా విశేషాలు, గౌతమ్, సితార ఫొటోలు పంచుకుంటూ ఉంటారు. ఈ సూపర్ స్టార్ అకౌంట్‌కి బోలెడంత మంది ఫాలోయర్లు ఉన్నారు. ఈ ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 5 మిలియన్లకు చేరుకుంది. 5 మిలియన్లు అంటే అక్షరాల అర కోటి. అదేనండీ... యాభై లక్షలు.
Comments
Please login to add a commentAdd a comment