'ఒక్కడు మిగిలాడు'కు అదే ప్రధాన ఆకర్షణ | Manchu Manoj Okkadu Migiladu Movie Update | Sakshi
Sakshi News home page

'ఒక్కడు మిగిలాడు'కు అదే ప్రధాన ఆకర్షణ

Published Wed, Oct 25 2017 3:09 PM | Last Updated on Wed, Oct 25 2017 3:13 PM

Manchu Manoj Okkadu Migiladu Movie Update

మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేసిన ఒక్కడు మిగిలాడు చిత్రం నవంబర్ 10న విడుదల కాబోతోంది. పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ ఈ సీ బ్యానర్ల పై ఎస్ ఎన్ రెడ్డి, లక్ష్మీకాంత్ ఎన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర విశేషాలను దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి వివరించారు. 'ఈ చిత్రం లో 35 నిమిషాల పాటు సాగే సముద్ర ప్రయాణం ప్రేక్షకుల మనసులను హత్తుకుంటుంది.

కొత్త నటీనటుల హావభావాలు ఆకట్టుకుంటాయి. బతుకు పోరాటంలో వారు ఎదుర్కొనే ఇబ్బందులు హృదయాలను కదిలిస్తాయి. ఈ సన్నివేశాలు చిత్ర ద్వితీయార్థం లో వస్తాయి. ప్రథమార్ధంలో వచ్చే యుద్ధ సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి. మనోజ్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని దర్శకుడు తెలిపారు. చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది.

ఛాయాగ్రహణం వికే రామరాజు పనితనం, శివ నందిగాం నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని అన్నారు. రెండు పాత్రల్లో మనోజ్ నటన అలరిస్తుంది. హీరోయిన్ అనీషా అంబ్రోస్, సుహాసిని మణిరత్నం, మిలింద్ గునాజీ, అజయ్, జెన్నిఫర్,  రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ పీఎస్ వర్మ, గ్రాఫిక్స్ శ్రీనివాసులు, పాటలు గురుచరణ్, రామదుర్గం మధుసూధన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement