సూర్యకు పచ్చజెండా? | Manju Warrier to Star Opposite Suriya in Murugadoss' Film? | Sakshi
Sakshi News home page

సూర్యకు పచ్చజెండా?

Published Sat, Jan 31 2015 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

సూర్యకు పచ్చజెండా?

సూర్యకు పచ్చజెండా?

సూర్యకు మంజువారియర్ నటన తెగనచ్చేసిందట. ఆయనిప్పుడు మాస్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నయనతార, ప్రణీత నాయికలుగా నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. కాగా సూర్య మలయాళంలో ఘన విజయం సాధించిన హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రం తమిళం, తెలుగు, హిందీ రీమేక్ హక్కులను పొందిన విషయం తెలిసిందే.15 ఏళ్ల తరువాత నటి మంజువారియర్ రీ ఎంట్రీ అయిన చిత్రం అది.

ఇంతకుముందు మలయాళంలో ప్రముఖ నాయకిగా విరాజిల్లిన మంజువారియర్ నటుడు దిలీప్‌ను ప్రేమ వివాహం చేసుకుని నటనకు దూరంగా ఉన్నారు. అయితే ఈ మధ్య దిలీప్‌తో మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత మంజువారియర్ నిర్మించిన చిత్రం హౌ ఓల్డ్ ఆర్ యు. ఈ చిత్రం తమిళంలో జ్యోతిక హీరోయిన్‌గా పునర్ నిర్మాణం అవుతోంది.

ఈ విషయం అటుంచితే మలయాళంలో మంజువారియర్ నటన తెగ నచ్చేయడంతో సూర్య ఆమెను తన చిత్రంలో నటించమని కోరారట. అందుకామె పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం మాస్ చిత్రంలో నటిస్తున్న సూర్య తదుపరి ఎ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నటి మంజువారియర్ ఒక ముఖ్యపాత్రలో నటించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement