ముంబయి: తనకు డబ్బు అవసరం ఉన్నప్పుడు మాత్రమే కమర్షియల్ చిత్రాల్లో నటిస్తానని ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ అన్నారు. సత్యా, పింజర్, స్కూల్, రాజ్ నీతి, గ్యాంగ్స్ ఆప్ వాస్సెపూర్, అలీఘడ్ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన బుధవారం మీడియాతో కొన్ని అభిప్రాయాలు పంచుకున్నారు.
'నాకు డబ్బు అవసరం ఉన్నప్పుడు కమర్షియల్ చిత్రాలు చేస్తాను. ఇప్పటికీ నేను నటించేందుకు కమర్షియల్ చిత్రాలు నాకోసం లేవు. వాటిల్లో నటించడానికి అక్కడ గొప్పగొప్ప వారు ఉన్నారు. కమర్షియల్ చిత్రాల్లో నటించేందుకు నాక్కూడా ఆఫర్లు వస్తాయి.. కానీ చాలా తక్కువ' అని ఆయన చెప్పారు. త్వరలోనే ట్రాఫిక్ అనే చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.
ట్రాఫిక్ అనేది మలయాళ సినిమాకు రీమేక్. ఇది నాకు ఇప్పుడు అవసరం కాదు. దానికోసం 2011లో విడుదలైంది. ఈ సందర్భంగా ఆ చిత్రం గురించి మనోజ్ చెబుతూ అది చాలా గొప్ప చిత్రం అని, స్ఫూర్తిదాయకమైనదని చెప్పారు. ఈ చిత్రం ఈ నెల 6న విడుదలవుతుంది.
'డబ్బు అవసరమైనప్పుడే ఆ చిత్రాలు చేస్తా'
Published Wed, May 4 2016 2:23 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement