వరుణ్ తేజ నూతన చిత్రం ప్రారంభం | Megastar family attend Varun Teja's Telugu debut film launch | Sakshi
Sakshi News home page

వరుణ్ తేజ నూతన చిత్రం ప్రారంభం

Published Thu, Feb 27 2014 12:52 PM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

వరుణ్ తేజ నూతన చిత్రం ప్రారంభం - Sakshi

వరుణ్ తేజ నూతన చిత్రం ప్రారంభం

హైదరాబాద్ : మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెరమీదకు వస్తున్నాడు. చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు తనయుడు వరుణ్‌తేజ నూతన చిత్ర ప్రారంభోత్సవం గురువారం జరిగింది. రామనాయుడు స్టూడియోస్లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంది. చిరంజీవి క్లాప్ కొట్టి షూటింగ్ను లాంఛనంగా ప్రారంభించారు. అలాగే చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథులు ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు.

శ్రీకాంత్‌ అడ్డాల డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు 'గొల్లభామ, ఆరడుగుల బుల్లెట్' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒక మిడిల్‌ టౌన్‌లో జరిగే లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి భారీ హిట్‌ సినిమాను అందించిన శ్రీకాంత్‌ అడ్డాల వరుణ్‌తేజను పరిచయం  చేసే కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నాడు. వరుణ్ తేజ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కి జే మేయర్ సంగీతం సమకూర్చుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement