నేపాల్ సహా భారత్ లోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు వెంటనే తరలివెళ్లాల్సిందిగా జాతీయ విపత్తు నివారణ బృందాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. నేపాల్ కేంద్రంగా శనివారం ఉదయం సంభవించిన భూకంపం అనంతర పరిణామాలపై అందుబాటులో ఉన్న మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించిన ఆయన సహాక చర్యలపై సమీక్ష నిర్వహించారు.
బాధితులకు వైద్య సదుపాయాలు అందించాలని, నేపాల్ లో చిక్కుకుపోయిన భారత యాత్రికులను వెంటనే స్వదేశానికి రప్పించే దిశగా ప్రయత్నించాలని సూచించారు. నేపాల్ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్, ప్రధాని సుశీల్ కోయిరాలాతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇటు భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించిన ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శనివారం రాత్రి కల్లా జాతీయ విపత్తు నివారణ బృందం నేపాల్కు చేరుకోనుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ప్రధానితో సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తక్షణం ఆదుకోండి: మోదీ ఆదేశం
Published Sat, Apr 25 2015 6:01 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM
Advertisement