'మంచు'వారి సాయం | Mohan Babu Food Distribution To Poor People | Sakshi
Sakshi News home page

'మంచు'వారి సాయం

Published Wed, Apr 8 2020 2:15 AM | Last Updated on Wed, Apr 8 2020 2:15 AM

Mohan Babu Food Distribution To Poor People - Sakshi

విష్ణు, మోహన్‌బాబు

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పలువురు దాతలు తమ వంతుగా సహాయం చేస్తున్నారు. మరికొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు తన కుమారుడు విష్ణుతో కలిసి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల్లోని పేద కుటుంబాలకు రోజుకు రెండుసార్లు భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ఎత్తివేసే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అంతేకాదు.. ప్రతిరోజూ 8 టన్నుల కూరగాయలను కూడా సరఫరా చేస్తున్నారు మోహన్‌బాబు, విష్ణు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement