రూమర్స్‌ నమ్మకండి : మోహన్‌బాబు పీఆర్‌ టీం | Mohan Babu PR Team Reacts on FDC Chairman Post | Sakshi
Sakshi News home page

రూమర్స్‌ నమ్మకండి : మోహన్‌బాబు పీఆర్‌ టీం

Published Thu, Jul 4 2019 2:30 PM | Last Updated on Thu, Jul 4 2019 2:31 PM

Mohan Babu PR Team Reacts on FDC Chairman Post - Sakshi

న‌టుడు, నిర్మాత‌, శ్రీ విద్యానికేత‌న్ సంస్థల అధినేత డా.మంచు మోహ‌న్‌బాబు ఎన్నికల ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ తరుపున ప్రచారంలోనూ పాల్గొన్న మోహన్‌ బాబు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటంలో తన వంతు బాధ్యత నిర్వర్తించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాడ్డ దగ్గర నుంచి మోహన్‌బాబుకు కీలక పదవులు ఇస్తున్నారంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో మోహన్‌బాబును తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమించే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను మోహన్‌ బాబు ఖండించారు. తాజాగా మోహన్‌ బాబును ఎఫ్‌డీసీ (ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌) చైర్మన్‌గా నియమించారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వార్తలను మోహన్‌బాబు పీఆర్‌ టీం ఖండించారు.ఆ వార్తల్లో నిజం లేదన్న పీఆర్‌ టీం, ఏదైనా ఉంటే అధికారికంగా తెలియజేస్తాం అని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement