'వాట్సప్లో మానస సరోవర దర్శనం' | Mohan Babu twwet about Manchu laxmi Manasa sarovera Yathra | Sakshi
Sakshi News home page

మానస సరోవర యాత్రలో మంచు లక్ష్మి

Published Mon, Sep 11 2017 4:21 PM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

'వాట్సప్లో మానస సరోవర దర్శనం'

'వాట్సప్లో మానస సరోవర దర్శనం'

సీనియర్ నటుడు మోహన్ బాబుకు దైవ భక్తి కాస్త ఎక్కువన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన వారసులకు కూడా భక్తి భావం  అధికమే. ప్రస్తుతం మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ మానస సరోవర యాత్రలో ఉన్నారు. యాత్రలో భాగంగా సోమవారం ఈశ్వర దర్శనం చేసుకున్న మంచు లక్ష్మీ వాట్సప్ లైవ్ ద్వారా తన తండ్రికి ముక్కంఠి దర్శనం చేయించారు.

ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజ్ లో వెల్లడించిన మోహన్ బాబు.. 'నా కుమార్తె లక్ష్మిప్రసన్న మానస సరోవర యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆ కైలాసనాథుని దర్శించుకుని ఆశీస్సులు పొందింది....వాట్స్యాప్ లైవ్‌ లో నాక్కూడా ఈశ్వరుని దర్శనభాగ్యం కలుగగా నా జీవితం ధన్యమయ్యింది. ఆ పరమశివుడు అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను.శంభోశంకర' అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement