అతను బిజినెస్‌మన్ కాదు
ఎప్పుడూ వార్తల్లో ఉండే హీరోయిన్లలో లక్ష్మీరాయ్ ఒకరు. హీరోయిన్‌గానూ, ఐటమ్ సాంగ్స్‌తోనూ దూసుకుపోతోంది. తాజాగా ఆమె చెబుతున్న కబుర్లేమిటంటే..నేను బెంగుళూరు అమ్మాయినైనా కన్నడంలో కొన్ని చిత్రాల్లోనే నటించాను. అదీ స్నేహితులు, అభిమానుల కోసమే ఆ చిత్రాలను అంగీకరించాను. నాకు తమిళం, తెలుగు, మలయాళం భాషలలోనే మంచి మార్కెట్ ఉంది.
ఇంతకుముందు కాస్త బరువెక్కినా వ్యాయూమం చేసి సన్నబడ్డాను. నా గురించి మీడియూ చాలా ఎక్కువగానే ప్రచారం చేస్తోంది. నా చిరకాల బాయ్‌ఫ్రెండ్ పెద్ద బిజినెస్‌మన్ అంటూ మీడియూలో ఊదరగొడుతున్నారు. నిజానికి ఆయన బిజినెస్‌మన్ కాదు. మా మధ్య స్నేహం తదుపరి స్టేజికి చేరినప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తా.