లైఫ్ ఈజ్ సో సింపుల్ నాన్నా... | My Son Said to me Life Is So Simple, says Venkatesh | Sakshi
Sakshi News home page

లైఫ్ ఈజ్ సో సింపుల్ నాన్నా...

Published Wed, Jan 7 2015 11:49 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

లైఫ్ ఈజ్ సో సింపుల్ నాన్నా... - Sakshi

లైఫ్ ఈజ్ సో సింపుల్ నాన్నా...

వెంకటేశ్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడినా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ స్టార్‌లా కాకుండా ఓ కామన్ మ్యాన్‌లా ఆయన థింకింగ్ ఉంటుంది. జయాపజయాలు, ఇమేజ్‌ల కోణంలో కాకుండా ఓ ఆధ్యాత్మిక ధోరణిలో ఆలోచిస్తారు. పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన నటించిన ‘గోపాల గోపాల’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వెంకటేశ్ మీడియాతో  ముచ్చటిస్తూ చెప్పిన 7 ఆసక్తికరమైన విషయాలు.
 
# ‘గోపాల గోపాల..’ ఇది గాడ్‌కి సంబంధించిన సినిమా. వినోదం తప్ప ఎక్కడా సందేశాలుండవు.  నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించారు.

# ‘ఓ మై గాడ్’ని  తెలుగులో చేద్దామనుకున్నపుడు,  దేవుడి పాత్రకు పవన్‌కల్యాణ్  కరెక్ట్ అని మేమంతా అనుకున్నాం. అతను కూడా వెంటనే ఓకే చెప్పారు. అయినా మేమిద్దరం ఎప్పటి నుంచో కలిసి సినిమా చేయాలనుకుంటున్నాం. ఇన్నేళ్లకు ఇలా కుదిరింది.
 
 # పవన్‌కల్యాణ్‌లో మంచి కామిక్‌సెన్స్ ఉంది. చాలా ఫెయిర్ పర్సన్. దేవుడి పాత్ర చేయాలంటే చాలా డివైన్‌గా ఉండాలి. అంత ప్యూరిటీ,
 పాజిటివ్ ఎనర్జీ పవన్‌లో ఉన్నాయి.
 
# నాకు దైవభక్తి ఉంది. కాకపోతే ఒక దేవుణ్ణే  కొలవడం అంటూ ఏమీ లేదు. ఈ ప్రపంచాన్ని ఏదో ఒక శక్తి నడిపిస్తుందని నమ్ముతాను. అసలు దేవుడు మనలోనే  ఉన్నాడని నమ్ముతా.  నేను రీమేక్‌లే  చేయాలని నిబంధన పెట్టుకోలేదు.  కథ నచ్చడమే నాకు ప్రధానం.
 
# మా అబ్బాయి అర్జున్ రామ్‌నాథ్ స్కూల్‌కి  వెళుతున్నాడు. ఈమధ్య నా దగ్గరకు వచ్చి ‘లైఫ్ ఈజ్ సో సింపుల్ నాన్నా’ అని చెప్పాడు. ఆశ్చర్యపోయాన్నేను. పిల్లలకు ఆధ్యాత్మికత  గురించి కూడా కొంచెం,  కొంచెం చెబుతూ ఉండాలి.
 
# మనకు ఉన్నంతమంది యంగ్ హీరోలు ఇంకెక్కడా లేరు. అందరూ బాగా చేస్తున్నారు. పోటీ ఎక్కువ ఉంది కాబట్టి,  వాళ్ల మీద ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement