'మా ఆవిడ నానికి పెద్ద ఫ్యాన్' | My Wife Is A Big Fan Of Nani - NTR | Sakshi
Sakshi News home page

'మా ఆవిడ నానికి పెద్ద ఫ్యాన్'

Published Tue, Mar 3 2015 5:13 PM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

'మా ఆవిడ నానికి పెద్ద ఫ్యాన్'

'మా ఆవిడ నానికి పెద్ద ఫ్యాన్'

హైదరాబాద్: భర్త అల్లాటప్పా హీరో కాదు టాలీవుడ్ బాద్షా. అతడి భార్య మాత్రం మరో హీరోకు పెద్ద ఫ్యాన్. అతడు నటించిన చిత్రాలు చూసి ముగ్ధురాలవుతుంది. ఆ విషయాన్ని ఆమె భర్తే స్వయంగా వెల్లడించారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? అయనే జూనియర్ ఎన్టీఆర్. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి. ఆమెకు 'ఈగ'  హీరో నాని నటన అంటే చాలా చాలా ఇష్టమట.

'పిల్ల జమీందార్' చిత్రంలో నాని నటన ఆమెకు చాలా నచ్చిందట. ఆ చిత్రాన్ని తనతో కలసి ప్రణతి ఎన్నో సార్లు చూసిందో లెక్కించడం చాలా కష్టమని ఎన్టీఆర్ చెప్పారు.  మళ్లీ మళ్లీ ఆ సినిమా చూద్దామని ఆమె తెగ పోరు పెడుతోందని తెలిపారు. టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న మంచి నటుల్లో నాని ఒకరని ఈ సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement